నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయకనగర్ లో గల ఈవీఎం గోడౌన్ ను కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ లు బుధవారం పరిశీలించారు. నిబంధనలకు అనుగుణంగా ఈవీఎం గోడౌన్ సీల్ ను తెరిపించి, ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్ లు, ఎన్నికల సామాగ్రిని భద్రపరిచిన గదులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈవీఎం గోడౌన్ వద్ద భద్రతా ఏర్పాట్లను తనిఖీ చేసి, సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించిన కలెక్టర్, అవి నిరంతరం పనిచేసేలా చూడాలని, ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్లు, ఇతర సామాగ్రికి నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.