నగరంలోని 9, 53 వార్డులలో కమిషనర్ దిలీప్ కుమార్ పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరాపై తనిఖీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ విభాగం అధికారులు, డిప్యూటీ కమిషనర్, ఇతర మున్సిపల్ సిబ్బందితో పాటు స్థానిక కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నగరంలో పారిశుద్ధ్య పరిస్థితులు, తాగునీటి వసతులను మెరుగుపరచడం ఈ తనిఖీల ముఖ్య ఉద్దేశ్యం.