*బాధిత కానిస్టేబుల్ కుటుంబానికి పరామర్శ*

రాష్ట్ర షెడ్యూలు కులాలు, షెడ్యూలు తెగల కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య శనివారం బాధిత సీ. సీ. ఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రమోద్ కుమార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విధి నిర్వహణ సందర్భంగా కానిస్టేబుల్ హత్యకు గురి కావడం ఎంతో బాధ కలిగించిందని, బాధిత కుటుంబానికి కమిషన్ అండగా నిలుస్తుందని, పూర్తి స్థాయిలో న్యాయం జరిగేలా చూస్తామని భరోసా కల్పించారు. చైర్మన్ వెంట ఎస్సీ, ఎస్టీ సంక్షేమ, అభివృద్ధి శాఖల అధికారులు, కుల సంఘాల నాయకులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్