జైలును సందర్శంచిన జిల్లా న్యాయధికారి

జిల్లా న్యాయసేవా అధికార సంస్థ చైర్పర్సన్, జిల్లా ప్రధాన న్యాయాధికారి భారతలక్ష్మి మంగళవారం జిల్లా కారాగారాన్ని సందర్శించారు. ఖైదీలతో మాట్లాడి, వారి క్రమశిక్షణ, ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీశారు. రెండు, మూడు నెలలుగా బెయిల్ మంజూరు కాని ఖైదీల వివరాలను పరిశీలించి, బెయిల్ కోసం న్యాయవాదులను నియమించుకున్నారా అని అడిగి తెలుసుకున్నారు. ఆర్థిక స్థోమత లేని వారికి ఉచిత న్యాయ సహాయం అందించి, ప్రభుత్వ న్యాయవాదిని నియమిస్తామని ఆమె తెలిపారు.

సంబంధిత పోస్ట్