అనుమానాస్పద లావాదేవీలపై గట్టి నిఘా ఎన్నికల వ్యయ పరిశీలకులు

జిల్లాలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు ఎన్నికల ప్రచార ఖర్చులపై పకడ్బందీగా నియంత్రణ చర్యలు చేపట్టాలని జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు కిషన్ పమర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఏఈఓల బృందాలు అన్నివేళలా అప్రమత్తంగా ఉండాలని, ఎన్నికల వ్యయ నియంత్రణలో అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్లు (AEO)లు కీలక పాత్ర పోషించాలని సూచించారు. ప్రతి అభ్యర్థి ఖాతాలో ఖచ్చితంగా ఖర్చులను నమోదు చేయాలని, డబ్బు, మద్యం, విలువైన వస్తువుల అక్రమ పంపిణీపై గట్టి నిఘా ఉంచాలని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్