హోలీ పండుగ సందర్భంగా జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు చర్యలు తీసుకున్నట్లు నిజామాబాదు పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య తెలిపారు. ఆయన జిల్లా ప్రజలకు, పోలీసు అధికారులు, సిబ్బందికి హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలంతా హోలీ పండుగను ప్రశాంత వాతావరణంలో, సాంప్రదాయ పద్ధతుల్లో, సహజ సిద్ధమైన రంగులతో జరుపుకోవాలని సూచించారు.