నిజామాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో పరిపాలన సౌలభ్యం, విధి నిర్వహణలో భాగంగా శనివారం రాత్రి పెద్దఎత్తున బదిలీలు జరిగాయి. పోలీస్ కమిషనర్ కార్తికేయ ఉత్తర్వుల మేరకు 195 మంది ఏఎస్ఐ, హెడ్కానిస్టేబుల్, కానిస్టేబుల్ స్థాయి సిబ్బందిని వివిధ పోలీసుస్టేషన్లకు బదిలీ చేశారు. బదిలీ అయిన సిబ్బంది తక్షణమే కొత్త స్థానాల్లో విధుల్లో చేరాలని, ఎవరి బదిలీలు నిలిపివేయకుండా చూడాలని ఆదేశాలు జారీ అయ్యాయి.