జిల్లాలో 20 మంది ఎస్ఐల బదిలీలు: ఉత్తర్వులు జారీ

జిల్లాలో 20 మంది సబ్-ఇన్‌స్పెక్టర్ల (ఎస్ఐ) బదిలీలు జరిగాయి. ఈ మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇందల్వాయి ఎస్సై సందీప్‌ను ధర్పల్లి ఎస్సైగా, ధర్పల్లి ఎస్సై సామ శ్రీనివాస్‌ను వీఆర్​కు అటాచ్​ చేశారు. వీఆర్​లో ఉన్న సుమలతకు ఇందల్వాయి ఎస్​హెచ్​వో బాధ్యతలు అప్పగించారు. కమ్మర్​పల్లి ఎస్సై అనిల్​ రెడ్డిని మాక్లూర్​కు, మాక్లూర్​లో కొనసాగుతున్న ఎస్సై రాజశేఖర్​ను బోధన్​ రూరల్​ పీఎస్​కు బదిలీ చేశారు. బోధన్​ రూరల్​ పోలీస్​ స్టేషన్​లో ఉన్న మచ్చేందర్​ను ఎస్​బీకి అటాచ్​ చేశారు. వెయిటింగ్​లో ఉన్న శ్రీనివాస్‌ను కోటగిరి ఎస్సైగా, కోటగిరిలో ఉన్న సునీల్‌ను ఐదో టౌన్​ ఎస్సై–1గా నియమించారు.

సంబంధిత పోస్ట్