తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీసులకు శుభవార్త అందించింది. నిరంతరం విధి నిర్వహణలో ఉండే పోలీసులకు ప్రత్యేక సెలవులు మంజూరు చేయనున్నట్లు డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. కుటుంబాల్లో జరిగే శుభకార్యాలకు సెలవులు తీసుకోవచ్చని, ప్రతి పోలీసు తమ పుట్టినరోజు, పెళ్లిరోజున సెలవు తీసుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు. ఈ నెల 25న జారీ అయిన ఉత్తర్వులు తాజాగా వెలుగులోకి వచ్చాయి. కుటుంబంతో సమయం గడపలేని పోలీసులకు ఈ నిర్ణయం ఎంతో ఉపశమనం కలిగించనుంది.