నోడల్ అధికారులు సమర్ధవంతంగా విధులు నిర్వర్తించాలి

మున్సిపల్ ఎన్నికల నోడల్ అధికారులు తమ విధులను సమర్థవంతంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) అంకిత్ సూచించారు. శనివారం జరిగిన సమీక్షలో, ఎన్నికల సాధారణ పరిశీలకులు, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) లతో కలిసి పోలింగ్, కౌంటింగ్ ఏర్పాట్లపై చర్చించారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, సాఫీగా జరిగేలా కృషి చేయాలని, అవసరమైన సామాగ్రి సిద్ధంగా ఉంచాలని సూచించారు. ఈ నెల 13న పోలింగ్ నేపథ్యంలో సిబ్బంది ర్యాండమైజేషన్, శిక్షణ, బ్యాలెట్ పేపర్ల ముద్రణ, మెటీరియల్ మేనేజ్మెంట్, అధికారుల నియామకం వంటి అంశాలపై చర్చించారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా నిఘా, సరిహద్దు ప్రాంతాలలో తనిఖీలు ముమ్మరం చేయాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్