రేపు ఈ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా కట్

నగరంలో 08.04.2026న, 33/11 కెవి సబ్‌స్టేషన్ పరిధిలోని 11 కెవి ఫీడర్లలో 33KV టవర్ ఎరెక్షన్ పనులు చేపట్టనున్నట్లు విద్యుత్ శాఖ ఏడీఈ ప్రసాద్ రెడ్డి తెలిపారు. దీనివల్ల ఉదయం 8:00 నుండి 10:00 గంటల వరకు గౌశాల ఫీడర్ పరిధిలోని కాంగ్రెస్ భవన్, కవితా కాంప్లెక్స్, గంజ్, రామ్‌గోపాల్ స్ట్రీట్, దేవి రోడ్, మిర్చి కంపౌండ్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. అలాగే, ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు రైల్వే ఫీడర్ పరిధిలోనూ విద్యుత్ అంతరాయం ఏర్పడనుంది. వినియోగదారులు సహకరించాలని ఏడీఈ కోరారు.

సంబంధిత పోస్ట్