మున్సిపల్ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున, ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రజావాణి యధావిధిగా కొనసాగుతుందని, ప్రజలు, పిర్యాదుదారులు ఈ విషయాన్ని గమనించి జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కలెక్టర్ కోరారు.