నిజామాబాద్ జిల్లాలో హోలీ పండుగ సందర్భంగా ప్రజలు పాటించాల్సిన నిబంధనలను సీపీ సాయిచైతన్య తెలిపారు. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని ప్రజలకు ఈ ఆదేశాలు వర్తిస్తాయి. బహిరంగ ప్రదేశాలలో, రహదారులపై ఇష్టపడని వ్యక్తులు, ప్రదేశాలపై రంగులు లేదా రంగు నీటిని చల్లడం, రంగులు పూయడం వంటి చర్యల వల్ల చికాకు కలుగుతున్నట్లు పోలీసులకు నివేదికలు అందాయి. కావున, ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకోవాలని సూచించారు.