ఇంట్లో బంగారం, నగదు దాచవద్దు: ఎస్సై

ఎల్లారెడ్డి నియోజకవర్గం రామారెడ్డి మండల ప్రజలు తాళం వేసి ఊరెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఎస్సై మురళి సూచించారు. బుధవారం ఆయన ఒక ప్రకటనలో మాట్లాడుతూ తాళం వేసిన ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని దొంగతనాలు జరుగుతున్నాయన్నారు. విలువైన బంగారు ఆభరణాలు, నగదును ఇంట్లో దాచవద్దని, బంధువుల ఇళ్లకు లేదా పనుల మీద వెళ్లేటప్పుడు పక్కింటి వారికి, పోలీసులకు సమాచారం ఇచ్చి వెళ్లాలని కోరారు. గ్రామాల్లో అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని తెలిపారు.

సంబంధిత పోస్ట్