జొమాటోలో ఇక అనలాగ్ పనీర్‌కు నో!

ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై తమ ప్లాట్‌ఫామ్‌లో అనలాగ్ డెయిరీ ప్రొడక్ట్స్‌తో తయారు చేసిన వంటకాలను విక్రయించడంపై జీరో టాలరెన్స్ విధానం అమలు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ నిబంధనను ఉల్లంఘించే రెస్టారెంట్లను ప్లాట్‌ఫామ్‌ నుంచి తొలగించే అవకాశం ఉందని తెలిపింది. అనలాగ్ పనీర్ అనేది సాంప్రదాయ పాలతో కాకుండా నాన్-డెయిరీ పదార్థాలతో, తక్కువ ఖర్చుతో లభించే వెజిటబుల్ ఆయిల్స్‌తో తయారు చేస్తారు. ఇది ఆరోగ్యానికి సురక్షితం కాదు. పలు రాష్ట్రాల్లో ఈ ఫేక్ పనీర్‌పై నిషేధాలు అమల్లోకి వచ్చాయి.

సంబంధిత పోస్ట్