పంజాబ్లోని అమృత్సర్లో చెల్లుబాటు అయ్యే హై-సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్లు లేని వాహనాలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. నగర పోలీస్ కమిషనర్ హర్మన్బిర్ సింగ్ గిల్ ఆదేశాల మేరకు.. ఈ నంబర్ ప్లేట్లు లేని వాహనాలకు పెట్రోల్, డీజిల్, సీఎన్జీ సరఫరా నిలిపివేయనున్నారు. వాహనాలకు ముందు, వెనుక భాగాల్లో సరిగ్గా అమర్చిన, చెల్లుబాటయ్యే హై-సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు తప్పనిసరిగా ఉండాలని, అత్యవసర సేవలందించే వాహనాలకు మాత్రమే మినహాయింపు ఉంటుందని స్పష్టం చేశారు.