పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను తక్షణమే పెంచే ఆలోచన లేదని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. దేశంలో చమురు నిల్వలు 25 రోజులకు సరిపడా ఉన్నాయని స్పష్టం చేశాయి. చమురు దిగుమతి కోసం ప్రత్యామ్నాయాలు చూస్తున్నట్లు కేంద్ర వర్గాలు వెల్లడించాయి. ఎల్‌ఎన్‌జీ, ఎల్‌పీజీ దిగుమతి కోసం ఇతర మార్గాలను అన్వేషిస్తున్నట్లు పేర్కొన్నాయి.