వారం రోజుల్లో పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్: సీతక్క

TG: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. వారం రోజుల్లో పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తుందన్నారు. మహబూబాబాద్ పర్యటనలో ఉన్న ఆమె.. ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు. రైతులకు రైతు భరోసా డబ్బులు 2-3 రోజుల్లో చెల్లిస్తామన్నారు. ఇప్పటికే సర్పంచ్ ఎన్నికలకు సర్వం సిద్ధం చేస్తోన్న అధికారులు.. నోటిఫికేషన్ వచ్చిన నెలరోజుల లోపే ఎన్నికలను పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్