రెండో విడత GPO పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

TG: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న గ్రామ పాలన అధికారుల(GPO) పోస్టులను భర్తీ చేసేందుకు రెండో విడతగా బుధవారం రెవెన్యూ శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. 10,954 జీపీవో పోస్టుల భర్తీకి తొలి విడతలో 3,550 మంది జీపీవోలుగా ఎంపియ్యారు. మిగతా ఖాళీల్లోనూ వీఆర్‌ఏ, వీఆర్వోలకు అవకాశం ఇవ్వగా.. దరఖాస్తులను ఆన్‌లైన్‌ ద్వారా ఈ నెల 16వ తేదీలోపు అందజేయాలని సూచించింది. ఇక అర్హత పరీక్షను ఈ నెల 27న నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్