మ్యాప్‌ మైఇండియా యాప్ లో ఆధార్ సెంటర్ల వివరాలు

ఆధార్ కార్డులో తప్పులు సరిచేయించుకోవాలన్నా, కొత్తది తీసుకోవాలన్నా ఆధార్ సెంటర్ ఎక్కడ ఉందో తెలియక ఇబ్బంది ఉండేది. దీనిపై ఆధార్ సంస్థ (UIDAI) MapmyIndiaతో ఒప్పందం కుదుర్చుకుంది. Mappls యాప్‌లో ఇకపై అధికారిక ఆధార్ కేంద్రాలను సులభంగా గుర్తించవచ్చు. ఈ ఫీచర్ ద్వారా అనధికార కేంద్రాలకు వెళ్లి మోసపోయే ప్రమాదం తగ్గుతుంది. కొత్త ఆధార్, అడ్రస్ మార్పు, ఫోన్ నంబర్ లింక్ చేయడం వంటి పనులకు ఏ సెంటర్‌కు వెళ్లాలో ముందే తెలుసుకోవచ్చు. ఈ ఫీచర్ రాబోయే కొద్ది నెలల్లో పూర్తిగా అందుబాటులోకి రానుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్