TG: వాహనాల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (RC), డ్రైవింగ్ లైసెన్స్ (DL) కార్డుల ప్రింటింగ్, పంపిణీ ప్రక్రియను సరళీకృతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ‘సెంట్రలైజ్డ్ ప్రింటింగ్, డిస్పాచ్’ పద్ధతిని ప్రవేశపెట్టనున్నారు. ఈ విధానానికి CM రేవంత్‌రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతం 61 ఆర్టీఓ కార్యాలయాల నుంచి కార్డులు పంపిస్తున్నారు. ఏడాదికి దాదాపు 14-15 లక్షల కార్డులు జారీ అవుతుండగా, వీటి బట్వాడాకు వారాలు, నెలల సమయం పడుతోంది. ఏజెంట్ల వద్దకు కార్డులు వెళ్లకుండా నేరుగా వాహనదారుడి ఇంటికే పంపేలా కసరత్తు జరుగుతోంది. సెంట్రలైజ్డ్ విధానంతో రాష్ట్రవ్యాప్తంగా ఒకే కేంద్రం నుంచి కార్డులు జారీ అవుతాయి.