పాతబస్తీలో మెట్రో నిర్మాణానికి సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో చేసుకున్న ఒప్పందాలపై మూడు వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని మెట్రో నిర్మాణ సంస్థను హైకోర్టు ఆదేశించింది. వారసత్వ కట్టడాల సంరక్షణ కమిటీ ఏర్పాటు విషయాన్ని అఫిడవిట్‌లో పొందుపర్చాలని సూచించింది. పాతబస్తీలో మెట్రో నిర్మాణం వల్ల చారిత్రక కట్టడాలు దెబ్బతింటున్నాయని దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సీజే ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది.