ఎల్పీజీ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీ చేసింది. ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన (PMUY) లబ్ధిదారులు తప్పనిసరిగా జూన్ 30లోపు ఆధార్ ఆధారిత ఈ-కేవైసీ పూర్తి చేయాలని సూచించింది. గడువులోగా ఈ ప్రక్రియ పూర్తి చేయకపోతే జూలై 1 నుంచి గ్యాస్ సబ్సిడీ బ్యాంకు ఖాతాలో జమ కాకపోవచ్చు. అయితే గ్యాస్ సిలిండర్ బుకింగ్, డెలివరీ సేవలకు ఎలాంటి అంతరాయం ఉండదని, పూర్తి ధర చెల్లించి సిలిండర్ పొందవచ్చని అధికారులు స్పష్టం చేశారు.