వినికిడి, దృష్టి లోపం ఉన్నవారికి కూడా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలోని ఆడియో, వీడియో కంటెంట్‌ను అందుబాటులోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ముసాయిదా మార్గదర్శకాలను జారీ చేసింది. కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ రాజ్యసభలో ఈ విషయాన్ని వెల్లడించారు. అక్టోబర్ 7న ప్రజాభిప్రాయం కోసం విడుదల చేసిన ఈ నిబంధనలను రెండు దశల్లో అమలు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. భారత మీడియా, వినోద పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది.