కేంద్రం ప్రభుత్వం శనివారం పద్మశ్రీ పురస్కారాలను ప్రకటించింది. అందులో భాగంగా ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ను పద్మశ్రీ పురస్కారం వరించింది. ప్రజా వ్యవహారాలకు సంబంధించి ఆయన చేసిన కృషికి గానూ ఆయనను కేంద్రం పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. దీంతో మందకృష్ణ మాదిగ అనుచరులు, సన్నిహితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయన సేవలను గుర్తించిన కేంద్రానికి ధన్యవాదాలు చెబుతున్నారు.