ఏప్రిల్ 1 నుంచి మారనున్న పాన్ కార్డు నిబంధనలు

ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుంది. దీంతో దేశ ప్రజలను ప్రభావితం చేసే పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. ముఖ్యంగా ఆదాయపు పన్ను నియమాల్లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. రూ.20 లక్షల్లోపు విలువ గల ఆస్తి లావాదేవీలకు పాన్ కార్డు తప్పనిసరి కాదని ఆదాయపు పన్ను శాఖ ముసాయిదా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పరిమితి రూ.10 లక్షలు కాగా, దీనిని రూ.20 లక్షలకు పెంచే అవకాశం ఉంది. ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే, తక్కువ విలువైన ఆస్తుల కొనుగోలు, అమ్మకాలకు పాన్ కార్డు అవసరం ఉండదు.

సంబంధిత పోస్ట్