పాపికొండల బోటింగ్ నిలిపివేత

భారీ వర్షాల సూచనల నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా చోడవరం పాయింట్ నుంచి పాపికొండల విహారయాత్రలను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. వచ్చే వారం రోజుల పాటు ఈ నిర్ణయం అమల్లో ఉండనున్నట్లు తెలిపారు. దీంతో ముందుగానే టికెట్లు బుక్ చేసుకున్న పర్యాటకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే భద్రాచలం కేంద్రంగా పోలవరం జిల్లా పోచవరం నుంచి నడిచే సుమారు 20 పర్యాటక బోట్ల సేవలను కూడా నిలిపివేయడంతో, బోటు కార్మికులు, ట్రావెల్స్, క్యాటరింగ్ రంగాలపై ఆర్థిక ప్రభావం పడుతోంది. పర్యాటక భద్రతతో పాటు పాపికొండల పర్యాటక అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని పర్యాటకులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్