అకాల వర్షాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా రాజమండ్రి నుంచి గోదావరి నదిలో సాగే పాపికొండల విహారయాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు AP అధికారులు ప్రకటించారు. పర్యాటకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. వాతావరణం అనుకూలించిన తర్వాతే యాత్ర పునరుద్ధరణపై స్పష్టత ఇస్తామని, అప్పటివరకు పర్యాటకులు సహకరించాలని కోరారు. అయితే, తెలంగాణలోని భద్రాచలం నుంచి పాపికొండల యాత్ర కొనసాగుతోంది.