ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఇప్పటికే లోక్‌సభలో ఆమోదం పొందిన ఈ బిల్లుకు, ఎగువ సభలో మూజువాణి ఓటుతో ఆమోదం లభించింది. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రపతి ఆమోదం పొందిన వెంటనే ఈ బిల్లు అధికారిక చట్టంగా మారనుంది.