రామగిరి మండలం రాజాపూర్ గ్రామ భూ నిర్వాసితులు తమ గ్రామంలో నిర్మించుకున్న పాత, కొత్త ఇండ్లకు పూర్తి స్థాయిలో పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆర్జీ– 3 డివిజన్ ఓసీ– 2 విస్తరణలో భాగంగా జరుగుతున్న భూ సేకరణలో తమ నివాసాలు కోల్పోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రాజాపూర్ గ్రామంలో జరిగిన సమావేశంలో సింగరేణి భూ సేకరణ అధికారి మాలోత్ శ్రీరామ్, మండల తహసిల్దార్ సుమన్, ఆర్జీ–3 ఎస్టేట్ అధికారి ఐలయ్యలు పాల్గొన్నారు. భూ నిర్వాసితుల ఇండ్ల విలువను సమగ్రంగా అంచనా వేసి న్యాయమైన పరిహారం ఇవ్వాలని వారు కోరారు.