పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష గురువారం విద్యా శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి, విద్యార్థులకు మెరుగైన బోధన అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ పక్కాగా నమోదు చేయాలని, ఉపాధ్యాయుల 95%, విద్యార్థుల 85% హాజరు తప్పనిసరిగా ఉండాలని సూచించారు. ఉపాధ్యాయుల సెలవులు ఆన్ లైన్ లో నమోదు చేయాలని, జిల్లాలోని 85 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 10వ తరగతిలో మెరుగైన ఫలితాల సాధనకు చర్యలు తీసుకోవాలని తెలిపారు.