నాణ్యమైన ధాన్యాన్ని వేగంగా కొనుగోలు చేసి, అదే రోజు రైస్ మిల్లులకు తరలించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. గురువారం కమాన్ పూర్ మండలం ఎంపిడిఓ కార్యాలయం, జడ్పిహెచ్ఎస్, ఐ. ఈ. ఆర్. సి సెంటర్, గుండారం ధాన్యం కొనుగోలు కేంద్రం, రామగిరి మండలం కల్వచర్ల గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రం, పన్నూరు గ్రామ పంచాయతీ కార్యాలయం, పన్నూరు పాఠశాలను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ధాన్యం నాణ్యతను నిరంతరం పరీక్షించాలని సూచించారు.