జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదివారం మంథనిలోని గంగపురి ప్రాంతంలో ఎంపీపీఎస్ పాఠశాల, క్రీడా మైదానం, సంగీత పాఠశాలను పరిశీలించారు. విద్యార్థులకు మెరుగైన క్రీడా, సంగీత విద్యా వసతులు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. క్రీడా మైదాన అభివృద్ధికి అవసరమైన అంచనాలను త్వరితగతిన సమర్పించాలని సూచించారు. అనంతరం రావులచెరువు, అయ్యగారి చెరువులను సందర్శించి పరిస్థితులను సమీక్షించారు.