స్త్రీ శక్తి భవనాన్ని ప్రారంభించాలి: కలెక్టర్

పెద్దపల్లి మండలం రాఘవపూర్ గ్రామంలో నిర్మిస్తున్న స్త్రీ శక్తి భవనం పనులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని ఈ నెల 31వ తేదీ నాటికి పూర్తి చేసి ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన రాఘవాపూర్ గ్రామంలో నిర్మాణంలో ఉన్న భవనాన్ని సందర్శించి, పనులను పరిశీలించారు. మిగిలిన పనులను తక్షణమే పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మంథని ఆర్డీవో సురేష్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్