వేసవిలో జిల్లాలో తాగునీటి సమస్య తలెత్తకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. మంగళవారం పెద్దపల్లి కలెక్టరేట్‌లో తాగునీటి సరఫరా, వేసవి యాక్షన్ ప్లాన్‌పై సమీక్ష నిర్వహించారు. మిషన్ భగీరథలో అంతరాయం ఏర్పడితే వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని సూచించారు. నీటి కొరతతో ప్రజలు ఒత్తిడికి గురికాకుండా సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు.