చివరి రోజు 78 నామినేషన్లు..

సుల్తానాబాద్ పురపాలక సంఘ ఎన్నికల ప్రక్రియలో భాగంగా శుక్రవారం 78 నామినేషన్లు స్వీకరించినట్లు కమిషనర్ రమేష్ తెలిపారు. మూడు రోజుల పాటు కొనసాగిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియలో చివరి రోజు వరకు మొత్తం 139 నామినేషన్లు స్వీకరించారు. ఈ మూడు రోజులలో ఇంటి పన్నులు, నల్లా బిల్లులు, సర్టిఫికేట్ ఫీజు ద్వారా రూ. 10,07,540 ఆదాయం పురపాలక సంఘానికి సమకూరింది. నామినేషన్ డిపాజిట్ల ద్వారా రూ. 1,08,750 ఆదాయంతో కలిపి మొత్తం రూ. 11,16,290 ఆదాయం సమకూరినట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్