జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మంగళవారం జూలపల్లి మండలంలోని తేలుకుంట గ్రామంలో కేజీబీవీ పాఠశాల, కళాశాల, పెద్దాపూర్ తెలంగాణ మోడల్ స్కూల్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, ముఖ్యంగా ఓపీ సమయాల్లో వైద్యులు తప్పనిసరిగా హాజరై సమయపాలన పాటించాలని ఆయన ఆదేశించారు. ఈ తనిఖీల్లో భాగంగా ఓపీ వివరాలను కూడా పరిశీలించారు.