జులై 3 నాటికి అర్హులైన ప్రతి ఓటరుకు ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ పూర్తి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. PDPLలోని ప్రగతి నగర్‌లో ఎస్‌ఐఆర్ ఓటరు నమోదు ప్రక్రియను పరిశీలించిన ఆయన, ప్రతి ఓటరుకు రెండు ఫారాలు అందించి, ఒకదాన్ని రసీదుగా ఇవ్వాలని శనివారం సూచించారు. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, పట్టణాల్లో బిల్ కలెక్టర్లు, వార్డు అధికారులు బీఎల్‌వోలకు పూర్తి సహకారం అందించాలని కలెక్టర్ పేర్కొన్నారు.