కునారం ఆర్‌ఓబీ పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్

పెద్దపల్లిలో కొనసాగుతున్న కునారం రైల్వే ఓవర్ బ్రిడ్జ్ (ఆర్ఓబీ) పనులను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్ఓబీ నిర్మాణంలో మొత్తం 46 స్లాబ్‌లలో 43 పూర్తయ్యాయని, ఒకవైపు విద్యుత్ పోల్స్ షిఫ్టింగ్ పనులు కూడా పూర్తయ్యాయని తెలిపారు. అప్రోచ్ రోడ్ల నిర్మాణం, మిగిలిన పనులను వేగవంతం చేయాలని, భవనాల కూల్చివేత పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. పనులపై అభ్యంతరాలుంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.

సంబంధిత పోస్ట్