ప్రభుత్వ కార్యాలయాలు ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించాలని, పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని, భూ భారతీ దరఖాస్తులను సకాలంలో డిస్పోజ్ చేయాలని, రిజిస్ట్రేషన్ ప్రక్రియను స్లాట్ల వారీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. మంగళవారం జూలపల్లి మండల తహసిల్దార్ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజలకు సేవలు అందించడంలో ఆలస్యం చేయరాదని ఆయన స్పష్టం చేశారు.