బుద్ధి మాంద్యం పిల్లల అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. బుధవారం సుల్తానాబాద్ పట్టణంలో బుద్ధి మాంద్యం పిల్లలకు ఏర్పాటు చేసిన పాఠశాల, చిల్డ్రన్ హోమ్, వృద్ధాశ్రమం, ఔషధ గోడౌన్, పెద్దపల్లి పట్టణంలోని చిల్డ్రన్ హోమ్ సందర్శించారు. బుద్ధి మాంద్యం పిల్లలకు ఏర్పాటుచేసిన పాఠశాలలో వారి అభివృద్ధి చెందుతున్న తీరును పరిశీలించి పలు సూచనలు చేశారు. అలాగే పెద్దపల్లి చిల్డ్రన్ హోమ్ లో కలెక్టర్ పిల్లలతో ముచ్చటించి వారికి అందుతున్న సేవల వివరాలు తెలుసుకున్నారు.