పట్టణ పరిశుభ్రత.. ప్రతి ఒక్కరి బాధ్యత

సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 7వ వార్డులో పారిశుధ్య ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ బిరుదు రాధాకృష్ణ, వైస్ చైర్మన్ అంతటి పుష్పలత, మున్సిపల్ కమిషనర్ లు హాజరయ్యారు. పట్టణ పరిశుభ్రతను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రజలు తమ పరిసరాలను శుభ్రంగా ఉంచాలని, మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని ఛైర్మన్ సూచించారు. వార్డు కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది, ప్రజలు పాల్గొని పరిసరాలను శుభ్రపరిచారు.

సంబంధిత పోస్ట్