పెద్దపల్లి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా డాక్టర్ పవిత్ర మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఈ పదవిలో ఉన్న డాక్టర్ ప్రమోద్ కుమార్ ఉద్యోగ విరమణ చేశారు. సిరిసిల్ల నుండి వచ్చిన డాక్టర్ పవిత్ర, జిల్లాలో ప్రభుత్వ నిర్దేశించిన లక్ష్యాలను అందరి సహకారంతో పూర్తి చేస్తామని తెలిపారు. ప్రజలు ఆరోగ్య కార్యక్రమాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు.