జిల్లాను ముందు వరుసలో నిలుపుదాం: కలెక్టర్

పెద్దపల్లి జిల్లా టిఎన్జీఓ సంఘం సభ్యులు శుక్రవారం నూతన సంవత్సరం సందర్భంగా కలెక్టర్ కోయ శ్రీ హర్షను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. గత ఏడాది జిల్లా ఉద్యోగులంతా కలసికట్టుగా పని చేసి ప్రజలకు ప్రభుత్వ ఫలాలు అందేలా కృషి చేశారని, ఈ ఏడాది కూడా అదే స్ఫూర్తిని కొనసాగించి జిల్లాను ముందు వరుసలో ఉంచాలని కలెక్టర్ శ్రీ హర్ష అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీఎన్జీఓ అధ్యక్షులు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల జేఏసీ చైర్మన్ బొంకూరి శంకర్ తోపాటు సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్