ఓటర్ జాబితాపై అభ్యంతరాలను తెలియజేయాలి: కలెక్టర్

పెద్దపల్లి జిల్లాలోని 3 మున్సిపాలిటీలు, 1 మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 124 వార్డులలో 2,58,059 ఓటర్లతో సిద్ధం చేసిన డ్రాఫ్ట్ ఓటర్ జాబితాపై అభ్యంతరాలుంటే వెంటనే మున్సిపల్ కార్యాలయంలో తెలియజేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి ఓటరు తమ ఓటు సరైన వార్డులో ఉందో లేదో పరిశీలించుకోవాలని, లేనిపక్షంలో ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ నెల 10న తుది ఓటర్ జాబితా ప్రచురణ ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్