ధర్మారం మండలంలోని రచ్చపల్లి, కానంపల్లి, కటికనపల్లి, ధర్మారం ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో ఇన్‌స్ట్రక్టర్, ఆయా పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎంఈవో ప్రభాకర్ తెలిపారు. ఇన్‌స్ట్రక్టర్ పోస్టుకు 10+2 ఉత్తీర్ణతతో పాటు బాల్య విద్య/ప్రాథమిక బోధనలో శిక్షణ, ఆయా పోస్టుకు 7వ తరగతి ఉత్తీర్ణత తప్పనిసరి. అర్హత గల అభ్యర్థులు జూన్ 9 లోపు స్కూల్ కాంప్లెక్స్ హెచ్‌ఎంలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.