నాణ్యమైన వైద్య సేవలు ఉచితంగా అందించాలి: కలెక్టర్

గోదావరిఖని జనరల్ ఆసుపత్రి పనితీరుపై జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఆసుపత్రిలో రోగులకు నాణ్యమైన వైద్య సేవలు ఉచితంగా అందించాలని, నిర్లక్ష్యం వహించినా, డబ్బులు ఆశించినా కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సమీక్షలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీ, రామగుండం నగరపాలక సంస్థ మేయర్ మహంకాళి స్వామి కూడా పాల్గొన్నారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్