పెద్దపల్లి జిల్లా, మంథని పట్టణంలో రోడ్లపై ఉన్న చిరు వ్యాపారుల షాపులను తొలగించాలని మున్సిపాలిటీ అధికారులు ఆదేశాలు సోమవారం జారీ చేశారు. పట్టణ అభివృద్ధి, రోడ్డు విస్తరణలో భాగంగా ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. అయితే, గత కొన్ని సంవత్సరాలుగా వ్యాపారాలు చేసుకుంటున్న వ్యాపారులు తమకు ప్రత్యామ్నాయ మార్గం చూపాలని అధికారులను కోరుతున్నారు. ఈ నేపథ్యంలో, షాపుల నిర్వాహకులు తమ హద్దు మేరకు తమ షాపులను తొలగించుకుంటున్నారు.