రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా గురువారం మాట్లాడుతూ, మహిళలు, బాలికల భద్రతకు షీ టీమ్స్ ఎప్పుడూ అందుబాటులో ఉంటాయని తెలిపారు. కమిషనరేట్ పరిధిలో షీ టీమ్స్ నిరంతరంగా సేవలు అందిస్తున్నాయని, వారిపై నమ్మకంతో వేధింపులపై ఫిర్యాదు చేసే వారి సంఖ్య పెరుగుతోందని పేర్కొన్నారు. పెద్దపల్లి జోన్‌లో ఒక షీ టీమ్, మంచిర్యాల జోన్‌లో రెండు షీ టీమ్స్ పనిచేస్తున్నాయని ఆయన వెల్లడించారు.