దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాత తాజాగా ఉత్తరాఖండ్‌లోని రామ్‌నగర్‌లో టైగర్ రిజర్వ్ పరిధిలోని అడవుల నడుమ ఉన్న రాంపుర్, లేటి, చోప్రా గ్రామాలు టోంగియా వర్గానికి చెందినవి. ఇవి బ్రిటిష్ కాలంలో అటవీ సంరక్షణ కోసం ఏర్పాటయ్యాయి. కానీ వీటిని రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయకపోవడంతో ఇప్పటివరకు అక్కడి ప్రజలకు ఓటు హక్కు లేదు. తాజాగా రెవెన్యూ హోదా లభించడంతో 1,302 మంది ఓటర్లు అక్కడ జరిగే పంచాయతీ ఎన్నికల్లో తొలిసారి ఓటు వేయనున్నారు.